వేద న్యూస్, వరంగల్ టౌన్:
బల్దియా పరిధి ఎనుమానుల 100 ఫీట్ రోడ్ ప్రాంతంలో అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కట్టడాన్ని బల్దియా కు చెందిన టౌన్ ప్లానింగ్,డి ఆర్ ఎఫ్ విభాగాలు పోలీస్ వారి సహాకారం తో కూల్చివేసినట్లు సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని, ఏనుమాముల వంద ఫీట్ ల రోడ్డు ప్రాంతం లో రోడ్డు ను ఆక్రమించుకొని అక్రమంగా ఇంటి నిర్మాణం చేసిన యజమానికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.
వారి నుండి ఎలాంటి వివరణ రాలేదని,అట్టి ఇంటికి తాళం వేసి ఉండడం తో బుధవారం పోలీసు వారి సమక్షం లో వీడియో రికార్డింగ్ ద్వారా పంచనామా నిర్వహించి కూల్చివేయడం జరిగిందన్నారు.
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని,నిబంధనలకు లోబడి అనుమతులు పొంది నిర్మాణాలు చేయాలని ఈ సందర్భం గా ఏ సి పి తెలిపారు.ఈ కార్యక్రమం లో టి పి బి ఓ లు శ్రీకాంత్,నరేందర్,రాజు నాయక్,సంధ్య రాణి తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.