వేద న్యూస్, డెస్క్ :

సమగ్ర వ్యవసాయ వ్యవస్థతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అగ్రికల్చర్ విద్యార్థులు అన్నారు. ఎస్ ఆర్ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ విద్యార్థులు హన్మకొండ జిల్లా నడికుడ గ్రామంలో స్థానిక రైతుల సహకారంతో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ప్రదర్శనను నిర్వహించారు.

ఈ ప్రదర్శనలో ఇంటిగ్రేటెడ్ ఫార్మేట్ సిస్టం ఎలా ఉంటుందో అని స్పష్టంగా వివరించారు. వ్యవసాయానికి ఒక వినూత్న విధానాన్ని స్థిరమైన వైవిధ్యభరితమైన ఉత్పత్తి కోసం ఎలా ఉపయోగపడుతుందో తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రవళిక, శ్రీహారిక, అనుష్క, మిణ్ హజ్, రక్షిత ,అశ్విత తదితరులు పాల్గొన్నారు.