వేద న్యూస్, జమ్మికుంట:
ప్రతి సంవత్సరం మే 16న జాతీయ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చిట్కాలను సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ తెలిపారు. ఆ విషయాలు ‘వేద న్యూస్’ పాఠకుల కోసం..
డెంగ్యూ జ్వరం ప్రధానంగా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దోమల నివారణ మందులను అమర్చడం, వలలు, తెరలను ఉపయోగించడం, నిలిచి ఉన్న నీటికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు పూర్తిగా కప్పి ఉండే దుస్తులు ధరించాలి. నిరుపయోగంగా ఉండే టైర్లు, బకెట్లు ఇతరాల్లో నీటిని తొలగించాలి. చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
డెంగ్యూ లక్షణాలు:
డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం ఉండటంతో పాటు తీవ్రమైన తలనొప్పి, కీళ్ల, కండరాల నొప్పి ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, కళ్ల వెనక నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రందించడం మంచిది.
అప్రమత్తతే మేలు.. ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్