వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
అనంతరం స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారుల వివరాలతో పాటు పెండింగ్ కేసులు, స్టేషన్ పనితీరును పోలీస్ కమిషనర్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పాలకుర్తి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి , ఎస్. ఐ చెన్న కేశవులును అడిగి తెలుసుకున్నారు.