- బీఆర్ఎస్ యువనేత దాసరి ప్రశాంత్ రెడ్డి
- సుల్తానాబాద్ మండలంలో ఇంటింటి ప్రచారం
వేద న్యూస్, సుల్తానాబాద్:
పెద్దపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ యువనాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. దాసరి మనోహర్ రెడ్డి ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి దాసరిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత్ రెడ్డి..వృద్ధులు, పెద్దలను ఆత్మీయంగా పలకరించారు. వారిని కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జనం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. గులాబీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు గుడుగుల సతీష్, గ్రామ సర్పంచ్ మూల స్వరూప-రాజేశం గౌడ్, ఉపసర్పంచ్ ఎర్రవెల్లి రామారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రవెల్లి వేణుగోపాల్ రావు, బీసీ సెల్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, వార్డు సభ్యులు వేల్పుల మల్లయ్య, తిరుపతి రావు, కొమ్మ సదానందం, గుడుగుల సదానందం, పోన్నం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.