- బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు
వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ:
రామగుండం అభివృద్ధి చెందాలంటే అది సోమారపు సత్యనారాయణ తోనే సాధ్యమవుతుందని బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. బుధవారం అన్విక కలర్ వరల్డ్ అడ్డగుంటపల్లి సంపత్ అధ్యక్షతన బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ స్వచ్ఛందగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ టిఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉదేశించి పెయింట్ వర్కర్స్ నాయకులు మాట్లాడుతూ గతంలో సత్యనారాయణ మున్సిపల్ ఛైర్మెన్ నుంచి ఎమ్మెల్యే గా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా రామగుండం అభివృద్ధి లో వెనుక పడిందని చెప్పారు.ఈ ఎలక్షన్లో మిముల్ని తిరిగి రామగుండము ఎమ్మెల్యే గా గెలిపంచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోమారపు సత్యనారాయన మాట్లాడుతూ పెయింటింగ్ వర్కర్స్ చాలాకాలంగా ఇక్కడ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనిి తెలిపారు.
వారు చెసె పనిలొ కార్మికులు అనారోగ్యం పాలు కావడం,ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని పేర్కొన్నారు . గెలిచాక ఇక్కడ సాంక్షన్ అయిన అయిన ఈ ఎస్ ఐ హాస్పిటల్ త్వరిత గతిన ఏర్పాటు చేస్తానని,తద్వారా పెయింటింగ్ వర్కర్స్ కు మెరుగైన వైద్య సదుపాయం లభిస్తుందని తెలిపారు. పెయింటింగ్ వర్కర్స్ కి తాను ఎల్లపుడు అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు సోమారపు అరుణ్ కుమార్ ,వీరన్నా,ఎం డి షేర్ ఖాన్,దిలీపభాగ్, కృష్ణ,బాబుఖాన్,సంతోష్,సంజీవ్,మోహన్, తదితరులు పాల్గొన్నారు