ms dhoni

టీమిండియా మాజీ సారధి.. చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు మహేందర్ సింగ్ ధోనీ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోనున్నాడు. అందుకే చెపాక్ లో జరిగిన మ్యాచ్ కి ధోనీ సతీమణీతో పాటు ఆయన తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఇదే ధోనీకి అఖరి మ్యాచ్ అని విశ్లేషకులతో పాటు ధోనీ అభిమానులు అందరూ భావించారు. తాజాగా ఎంఎస్ ధోనీ రాజ్ షమానీతో జరిగిన పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ” నాకు ఇప్పుడు నలబై మూడు ఏండ్లు. ఈ జూలై నెలతో నాకు నలబై నాలుగు ఏండ్లు వస్తాయి.

వచ్చే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా పది నెలల టైం ఉంది. అప్పుడు ఆడగలనా.. లేదా అనేది నా శరీరం సహాకరించేదానిపై ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. ధోనీ వ్యాఖ్యలతో ప్రస్తుత సీజన్ కంప్లీట్ గా ఆడతాడని ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరి గంతెస్తున్నారు.