- ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది
- లంబాడి ఐక్యవేదిక మండల కోఆర్డినేటర్ బానోతు ప్రవీణ్ నాయక్
వేద న్యూస్, మరిపెడ:
అయోధ్యలోనే శ్రీరామ జన్మభూమి పూజిత అక్షింతలను మరిపెడ మండలంలో ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ లో ఇటుకలగడ్డ గ్రామాలలో రామభక్తులు ఇంటింటికీ పంపిణీ చేశారు. ముందుగా శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ నుంచి గ్రామాలకు చేరుకున్న పూజిత అక్షింతలను ఆలయాలలో ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. అనంతరం ‘‘జైశ్రీరాం,జై జై శ్రీరామ్’’ అని నినాదాల నడుమ రామభక్తులు,తండావాసులు ప్రతీ ఇంటింటికి వెళ్లి శ్రీ రాముడి అక్షింతలను అందజేశారు.
శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తండ, గ్రామపంచాయతిలో ఇంటింటికీ వెళ్లి భక్తిశ్రద్ధలతో రాముడి అక్షింతలను పంపిణీ చేశారు. ఎన్నో సంవత్సరాల కల ఈరోజు నెరవేరినందుకు ఎంతో సంతోషిస్తున్నామని రామ భక్తులు ఆనందపడ్డారు.
ప్రతీ ఒక్కరూ శ్రీరామనమాన్ని జపిస్తూ భక్తిశ్రద్ధలతో రాముని అక్షింతలు తీసుకోవాలని లంబాడి ఐక్యవేదిక మండల కోఆర్డినేటర్ బానోతు ప్రవీణ్ నాయక్ తెలిపారు. శ్రీరాముని అక్షింతలు ప్రతీ గడపకు చేరడం అనేది ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
కార్యక్రమంలో ఎలమంచిలి తండా గ్రామ సర్పంచ్ పార్వతి మంగీలాల్, గ్రామ మాజీ అధ్యక్షుడు బద్రు నాయక్, బానోతు ప్రవీణ్ నాయక్, రమేష్ వెంకన్న, మహేందర్, సతీష్ ,రెడ్డి ,అఖిల్, సికిందర్, హుస్సేన్, గణేష్, మహేందర్, లాల్ సింగ్ రామభక్తులు పాల్గొన్నారు.