వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ:
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు మూడవ డివిజన్ అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లొ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా గత మూడు నెలల నుండి స్థానిక మహిళలకు బ్యూటిషన్ కోర్స్ లో శిక్షణ అందించారు. బ్యూటిషన్ కోర్స్ లో శిక్షణ పొందిన 60 మంది మహిళలకు బుధవారం మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత కేంద్రలను ఏర్పాటు చేశామన్నారు.,కుట్టు మిషన్ శిక్షణ మగ్గం వర్క్స్ బ్యూటిషన్ కోర్సులలొ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.రాబోయే ఎలక్షన్ లో రామగుండం ఎమ్మెల్యేగా రెండవసారి కోరుకంటి చందర్ ను గెలిపించాలని కోరారు. బ్యూటిషన్ కోర్స్ నేర్చుకున్న మహిళలు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్ మద్దతు గా నిలిచి గెలిపించుకుంటామని శపథం చేశారు.
అన్నపూర్ణ కాలని అంబేద్కర్ భవన్ లొ బ్యూటిషన్ కోర్స్ శిక్షణకు సహకరించిన మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ శారద దంపతులను శాలువతో సన్మానం చేశారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కుమ్మరి శారద, గోలివాడ చంద్రకళ, బ్యూటిషన్ కోర్స్ ట్రైనర్ సరిత , నాయకులు కంది చంద్రయ్య, దొమ్మేటి శేఖర్, పాల్గొన్నారు.