వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కేసీఆర్ క్రీడా కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మండిగా రేణుక రాజనర్సు మాట్లాడుతూ కేసీఆర్ క్రీడా కిట్లను అన్ని గ్రామాల యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీ ఓ అనిల్ రెడ్డి, సర్పంచులు వెంకటేశ్వరరావు, సింగిరెడ్డి ఏళ్లవ్వ రాజేశ్వర్ రెడ్డి, సింధుజ, ఎంపిటిసి ప్రేమలత, నాయకులు తిరుపతి, విజయ్, వినోద్, జగన్, మైపాల్ మరియు ఉప సర్పంచులు, కార్యదర్శులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
