- ఎన్ఎస్‌యూఐ హుస్నాబాద్ అధ్యక్షులు సనత్ ఆధ్వర్యంలో..
వేద న్యూస్, హుస్నాబాద్:
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ఎస్ యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. శుక్రవారం ఆయన తన స్వగ్రామం తీగలకుంటపల్లి లో ఉన్న ప్రాథమిక పాఠశాల లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం పాఠశాలలో ఉన్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్స్ పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో విద్యార్థుల యోగక్షేమాల గురించి మాట్లాడారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఉన్నత లక్ష్యం పెట్టుకుని విద్యార్థులు తము అనుకున్న రంగంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల చంద్రశేఖర్ రెడ్డి,గ్రామ ప్రజలు, ఎన్ఎస్‌యూఐ సభ్యులు పాల్గొన్నారు.