వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
హన్మకొండలోని ‘స్వయంకృషి మహిళా సొసైటి వృద్ధాశ్రమం’లో అనాథ వృద్ధులు 25 మందికి (16 మంది మహిళలు, 9 మంది పురుషులు)..పరాంకుశం హరికృష్ణ సంధ్య, వైష్ణవి, నిహిత (ఎన్ఆర్ఐ) కుటుంబం నూతన స్వెట్టర్లు శనివారం అందించింది. గత అక్టోబర్ నెలలో అమెరికా నుండి హన్మకొండ వచ్చిన హరికృష్ణ దంపతులు..సదాశయ ఫౌండేషన్ సూచన మేరకు స్వయంకృషి వృద్దాశ్రమంలో అనాథ వృద్దులకు అన్నదానం చేశారు.
అదే సందర్భంలో ఇక ముందు కూడా వృద్ధులకు కావల్సిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం వృద్ధులు చలికి తట్టుకోలేక ఇబ్బందిపడుతున్నారని..ఆశ్రమ నిర్వాహకులు శుభ, టి.శ్రవణ్ కుమార్‌కు తెలిపారు. హరికృష్ణ సహకారంతో స్వెట్టర్లు కొని వృద్దులకు శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శుభ మాట్లాడుతూ ఆశ్రమంలో ఉన్న కష్టాలను సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రవణ్ కుమార్ కు తెలిపిన ప్రతీ సందర్భంలో సాధ్యమైన సహాయం అందించారని చెప్పారు. అనాథ వృద్ధులకు చలికోట్లు ఇప్పించినందుకు వారికి, దాతలు పరాంకుశం సంధ్య-హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు ప్రభాకర్ రావు పాల్గొన్నారు.