- అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో..
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి..బుధవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆనంద నిలయం అనాథలకు దుప్పట్లు, స్వెటర్స్ ఉచితంగా అందజేశారు.
అనంతరం పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ 2024 విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ చలి ఎక్కువగా ఉండటంతో పిల్లలు ఇబ్బంది పడకూడదని దుప్పట్లు, స్వెటర్స్ ఇచ్చామని వివరించారు. ఇక్కడ ఉండే పిల్లలు అంతా పేద, అనాథ పిల్లలు అని పేర్కొన్నారు.
పిల్లలు బాగా చదువు కోవాలని, క్రమశిక్షణ తో మంచి నడవడికతతో, ఒక లక్ష్యము పెట్టు కొని చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదువు కోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు, సిబ్బందికి వినియోగదారుల చట్టం గురించి డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు. ప్రతీ చట్టంపై అవగాహన అవసరం అని వెల్లడించారు.
పిల్లలు చిన్నతనం నుండే వినియోగదారపు మెలకువలు నేర్చుకోవాలని తెలిపారు.ఎంత చిన్న వస్తువులను కొన్నా రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పెద్ద వస్తువులకు రసీదు తో పాటు గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు తీసుకొవాలన్నారు.
అప్పుడే మనం ఏ విధంగా మోసపోయినా వినియోగదారుల కోర్టు లో కేసు వేయొచ్చని వివరించారు. కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, కరుకాల ఆర్విక, వార్డెన్ సుజాత, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.