వేద న్యూస్, హన్మకొండ :
పట్టణ ఆరోగ్య కేంద్రం సోమిడీని గురువారం హనుమకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య సందర్శించారు. ప్రపంచ డయాబెటిస్ నివారణ దినోత్సవం సందర్భంగా డయాబెటిస్ స్క్రీనింగ్ పరీక్షల తీరును పరిశీలించారు. పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న డయాబెటిస్ పేషెంట్స్ కి మందులు ఉచితంగా నెల నెల అందించడమే కాకుండా ఫాలోఅప్ సేవలు అందించాలన్నారు.
టీ డయాగ్నస్టిక్ హబ్ కి అన్ని పరీక్షల నిమిత్తం శాంపిల్స్ పంపించాలన్నారు. ల్యాబ్, మెడికల్ స్టోర్, వ్యాక్సిన్ భద్రపరిచే విధానాన్ని, యూపిహెచ్సి లోని మెడికల్ స్టోర్ లో మందుల లభ్యతను, రికార్డులను పరిశీలించారు.