వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి భారత రత్న డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు ఎమ్మెల్సీశంకర్ నాయక్ లు మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా,, బి ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరు.. కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు అని.దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది.అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. మన జీవన శైలిలో మార్పులు రావాలి మన భవిష్యత్తు మారాలి అంటే చదువు ఒక్కటే ఆయుధం అని బోధించిన మహనీయులన్నారు..అంబేద్కర్ మన భారత జాతి సంపద వారు మన దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి వారు ప్రతీ ఒక్కరు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,పలు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.