వేద న్యూస్, జమ్మికుంట:
ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాల జమ్మికుంటలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వకుళాభరణం స్వరూపరాణికి కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రొఫెసర్ టి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో “హైడ్రో బయలాజికల్ స్టడీస్ అండ్ సర్వే ఆఫ్ ఏవిఫానా అండ్ ఇక్తియోఫానా ఆఫ్ లోయర్ మానేర్ డ్యాం కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేశారు.
అధ్యాపకురాలు స్వరూపరాణి కి డాక్టరేట్ రావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ ఎడమ శ్రీనివాస్ రెడ్డి, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ ఎం. రామ్మోహన్రావు, అధ్యాపకులు ఆర్. ఈశ్వరయ్య, డాక్టర్ టి. శ్రీలత ,డాక్టర్ బి. సువర్ణ, పీడి సుజాత, మహేందర్ రావు, డాక్టర్ ఎంబడి రవి, డాక్టర్ రవి ప్రకాష్, డాక్టర్ . పి . సుష్మ ,ఎల్. రవీందర్, పి, శ్రీనివాస్ రెడ్డి, మమత, లైబ్రేరియన్ భీమారావు తదితరులు సంతోషం వ్యక్తం చేసి ఆమెకు అభినందనలు తెలిపారు.