వేద న్యూస్, ఎల్కతుర్తి:
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ సర్కారేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గురువారం వారు ఎల్కతుర్తి మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా వారు ఇంటింటికీ వెళ్లి జనానికి కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి చెప్పారు. గడపగడపకు పోస్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, పార్టీ ఎల్కతుర్తి గ్రామ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్, యూత్ నాయకులు అంబాల శ్రీకాంత్, గూడెల్లి నవీన్, హింగె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.