వేద న్యూస్, వరంగల్:

వరంగల్ పార్లమెంట్ పరిధిలోని పరకాల నియోజకవర్గకేంద్రంలో  ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకుల సమావేశం గురువారం జరిగింది.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా ఎస్సీ సె ల్ అధ్యక్షుడు, వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం దళితులు, 95% ఓట్లు కాంగ్రెస్ పార్టీ కి వేశారన్నారు, దళిత, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనీ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

స్థానిక శాసన సభ్యుడు రావూరి ప్రకాష్ రెడ్డి పేదలను ఆదుకునే నాయకుడు అని వెల్లడించారు. పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడే నాయకులను కాపాడుకునే నాయకులు అని రామకృష్ణ కొనియాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు చంద్రమౌళి , ఇనుగుల రమేష్ , మోహన్ , జిల్లా ఉపాధ్యక్షుడు నందిపక భాస్కర్ , కార్యదర్శి మహేందర్ , జిల్లా నాయకులు జగన్ గౌడ్ , మహేష్ గౌడ్ ,
జిల్లా, మైనారిటీ, బీసి, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.