వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో బాషిపంగు వెంకన్న(32) అనారోగ్య కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ గురువారం వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంకన్న పార్థిహదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను రెడ్యా నాయక్ పరామర్శించారు.

రెడ్యా నాయక్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర కుమారి, మహేందర్ రెడ్డి, మరిపెడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ రాంలాల్ గోల్కొండ వెంకన్న తదితరులున్నారు.