• భక్తుల భజనలు బతుకమ్మ పాటల తో దుర్గ దేవి ఆగమన్ కార్యక్రమం

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రం లో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యువ మిత్ర యూత్, ఆధ్వర్యంలో ఘనంగా దుర్గ దేవి, ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

యువ మిత్ర యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీనగర్ నుండి గ్రామంలోకి దాదాపు 20 కారులతో ర్యాలీ నిర్వహించి భక్తుల కోలాటాలు, భజనల, మధ్య బతుకమ్మ ఆటల మధ్య ర్యాలీ నిర్వహించారు.

తొమ్మిది రోజులపాటు మండపాలలో కులువుదీరి, నవరాత్రి పూజలు అందుకొనున్న దుర్గాదేవి ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల తో స్వాగతం పలికారు.