- ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో..
- ఆ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్న బానోతు
వేద న్యూస్, ఖమ్మం/కొత్తగూడెం:
ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వైరా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాయకులు బానోతు దుర్గా ప్రసాద్ ను ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు బుధవారం పార్టీ బీ ఫామ్ కూడా అందజేశారు. జూలూరుపాడు మండలంలో ఏవిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సుధీర్ ఆదేశాలతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి రవిచంద్ర చవాన్..ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ బానోతు దుర్గాప్రసాద్ కు ఇచ్చారు.

ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ(ఐపీసీ) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, జనం శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటు పడతానని స్పష్టం చేశారు.
వైరాలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పని చేస్తానని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గాలలో నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు బానోతు రాంబాబు నాయక్, బోడ రవి, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.