వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం దుర్గామాత ఉత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. మొదటగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి దుర్గామాత విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ఆర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం గ్రామంలో ఘనంగా దుర్గ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి ఏళ్లవ్వ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు గుర్రం మల్లారెడ్డి, శ్రీనివాస్, లాలపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.