వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని ఫిజియోథెరపీ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు తన బృందంతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. జమ్మికుంట పట్టణంలో ఒక ఫిజియోథెరపీ సెంటర్ వారు రిజిస్ట్రేషన్ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అప్లయ్ చేసుకున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజరాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు ఫిజియోథెరపీ సెంటర్ ను తనిఖీ చేశారు. డి ఆర్ ఏ ఆక్ట్ ప్రకారం ఫిజియోథెరపీ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.

సెంటర్ కలియతిరిగి, పరిసరాలను చూశారు. ఈ తనిఖీ పై నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపిస్తామని తెలిపారు. హుజురాబాద్ డివిజన్లోని ప్రైవేట్ హాస్పిటల్ లు రిజిస్ట్రేషన్ లేకుండా ఒకవేళ నడిపిస్తే డి ఆర్ ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో డాక్టర్ మహోన్నత పటేల్,జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.