- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
వేద న్యూస్, చొప్పదండి :
కాంగ్రెస్ సర్కారు అలసత్వం మరోసారి రైతుల పాలిట శాపంగా మారిందని, చొప్పదండి మాజీ శాసన సుంకె రవిశంకర్ అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మళ్లీ నష్టాల మూటే మిగలనుందని, వానకాలం కోతలు ఇప్పటికే మొదలైనా.. సర్కారు ఇంకా కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొన్నదని అన్నారు.
ఈ నెల ఒకటి నుంచే కేంద్రాలను ప్రారంభిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. నియోజకవర్గం లో అత్యధిక ప్రాంతాల్లో నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనేలేదని, కొన్నిచోట్ల ఆర్భాటంగా రిబ్బన్ కట్‌చేసినా కోనుగోళ్లు మాత్రం చేపట్టడంలేదని అన్నారు.
దీంతో పలుచోట్ల కేంద్రాల వద్ద రైతులు 20 రోజులుగా పడిగాపులు పడుతున్నారని,
ఇంత జరుగుతున్నా ఆయా కేంద్రాలకు మిల్లులు అలాట్‌మెంట్ చేయడంలో అధికార యంత్రాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని అన్నారు. ఈ సమస్యపై జిల్లాల ఇoచార్జి మంత్రులు కనీసం సమీక్షలు చేసిన పాపాన పోలేదని, మరోవైపు వర్షాలొస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో ఆన్నదాతల్లో ఆందోళన నెలకొన్నదని, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే దుస్థితి ఏర్పడిందని అన్నారు.
బోనస్‌కు ఎగనామం పెట్టేందుకే కొనుగోలు కేంద్రాల ప్రారంభ విషయంలో కాంగ్రెస్ సర్కారు అలసత్వం చూపుతున్నదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం, అడుగడుగునా ప్రణాళిక లోపం స్పష్టంగా కనబడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.