- డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్
వేద న్యూస్, వరంగల్:
ప్రతి రైలులో సాధారణ భోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ఐదు సాధారణ భోగీల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ దేశవ్యాప్త ఉద్యమ కార్యక్రమములో భాగంగా వరంగల్ బస్ స్టాండ్ ఆవరణలో సాధన కమిటీ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఆడేపు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సాధారణ భోగీల సాధన కోసం ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల గాంధీ మార్గంలో ఉద్యమాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేస్తూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతిరోజు దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నట్లు అనధికార అంచనా ఉండగా, ఈ ప్రయాణంలో జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఆగమ్య గోచరంగా ఉంటుందని,సీట్లు తక్కువగా ఉండటం,బోగీల్లో స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలై చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశాన్ని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా టు, ది ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, 152 సౌత్ బ్లాక్, రైసినా హిల్స్ ,న్యూఢిల్లీ-110011. చిరునామాకు మన బాధను, డిమాండ్ ను అభిప్రాయాల్ని తెలుపుతూ ఉత్తరం రాసి పంపాలని కోరారు. వివరాలకు 9989310141 లలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు సీనియర్ సిటిజన్స్ ఉత్తరాలు రాసి పోస్ట్ డబ్బాలో వేశారు. ఈ కార్యక్రమంలో పునర్తు శ్రీనివాస్ , ఎండి ఉస్మాన్, కిరణ్, కొత్తూరు శ్రీనివాస్, తలకోట్ల విజయకుమార్, కొలెపాక రాజు, బొట్టు స్వామి, పెసర రమేష్, కామ శెట్టి రమేష్, గోపి, సుంకా సందీప్, సునీల్ నాయక్ తదితరులు సుమారు 200 మంది ఉత్తరాలు రాసి పోస్ట్ డబ్బాలో వేశారు