వేద న్యూస్, కేయూ క్యాంపస్:
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతిని ఎత్తివేయాలని, అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని, సరైన టైంలో రిజల్ట్స్ ఇవ్వాలని ,ఫార్మసీ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతి ఎత్తివేయాలని వేలాది మంది విద్యార్థులతో గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పట్టించుకోకుండా ఎటువంటి సర్కులర్లు జీవోలు తీయకుండా కాలయాపన చేసిన కాకతీయ యూనివర్సిటీ అధికారులు అత్యవసరంగా సర్కులర్లు తీస్తూ విద్యార్థులకు ఉపయోగపడని అంశాలపై అర్థరాత్రి జీవోలు సృష్టిస్తున్న యూనివర్సిటీ అధికారులు. ప్రశ్నిస్తున్న విద్యార్థులపై ఉక్కు పాదం మోపుతున్న యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా కేయూలోని అన్ని డిపార్ట్మెంట్లో సరిపడా ప్రొఫెసర్లు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న కూడా పట్టించుకోని అధికారులు, కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీలో మహిళ మూత్రశాలలో నీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురైనా ఏ రోజు కూడా స్పందించని అధికారులు ఉపయోగపడని అంశాలపై త్వరగా స్పందిస్తూ అర్థరాత్రిలో జీవోలు తీస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసే ప్రక్రియ యూనివర్సిటీలో జరుగుతుంది. కాబట్టి తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నామన్నారు. నిన్న కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో కుళ్ళిపోయిన, పుచ్చిపోయిన కూరగాయలు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు గురికావడం కూడా జరిగిందని, ఇప్పటివరకు ఆ అంశంపై స్పందించకుండా విద్యార్థులపై ఉక్కు పాదం మోపుతూ ఆ విద్యార్థుల డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి లతో చెప్పి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే ప్రక్రియ జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు మోజెస్, చెట్టుపల్లి శివకుమార్, విష్ణు, ఆనంద్, భాస్కర్, సతీష్, సుఖేష్, అవినాష్ , శ్రావణ్, అజయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.