– కలెక్టర్ ఇలా త్రిపాటి
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని ఓటర్ల నమోదు మార్పులు,చేర్పులు,బీ ఎల్ ఓ యాప్ తదితర విషయాలపై బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ సూపర్వైజర్స్ కు జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అధికరణ 324, 325, 326 ప్రకారము ఎన్నికల సంఘ నియమావళిని అనుసరించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ఏ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బి ఎల్ ఓ లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి బి ఎల్ ఓ మీ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఫామ్ 6,7,8 లకు సంబంధించిన ఓటర్ల నమోదు పై అవగాహన ఏర్పరచుకొని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని,పరిపూర్ణమైన ఓటర్ల జాబితాను నమోదు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వేములపల్లి తహశీల్దార్ హేమలత, నాయబ్ తహసీల్దార్ కోటేశ్వరి, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ గుడిపాటి కోటయ్య, శ్రీను, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మహేందర్ రెడ్డి, స్పందన రెడ్డి, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది హర్ష,ఇమ్రాన్,గణేష్ రాధా, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.