వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలకేంద్రంలో ముదిరాజ్ కులస్తులు వీణవంక మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు అన్ని విధాల మేలు జరిగే విధంగా కుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. సంఘ సభ్యులందరికీ అందుబాటులో ఉండి సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కమిటీకి అందరూ సహకరించాలని కోరారు. వీణవంక మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా కోర్కల్ గ్రామానికి చెందిన కొలిపాక స్వామి, ఉపాధ్యక్షుడిగా ఎలబాక గ్రామానికి చెందిన పోలు ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా ఎలవేణ సమ్మయ్య, కార్యవర్గ సభ్యులుగా కొలిపాక నాగరాజు, పోలు ఐలయ్య, ఐలవేణి సదానందం, కొలిపాక కొమురయ్య, పోలు రాజు, మోటం వెంకటేష్, కొత్తపల్లి శంకర్, కలవేణి సమ్మయ్య, ఉప్పరవేణి ఓదేలును ఎన్నుకున్నారు. ఎన్నికలకు సహకరించిన ప్రతీ ఒక్క కుల బాంధవులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.