వేద న్యూస్, వరంగల్ టౌన్:
రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ, విద్యుత్ వినియోగంలో సంరక్షణపై అధికారులు చూపుతోన్న నిర్లక్ష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పగటి పూట కొన్ని జంక్షన్ లో వీధి లైట్లు వెలుగుతూనే ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్, రామస్వామి గుడి, నానామియా తోట రహదారులు వెంట ఎలాంటి అవసరం లేకపోయినా ఉదయం పూట కూడా వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. పగటి పూట వెలుగుతున్న వీధి లైట్ల విద్యుత్ లైన్‌లను సరిచేసి, విద్యుత్ వృధాను అరికట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.