•  అందరి సహకారంతో పకడ్బందీగా సేవలందిస్తా: ఏఈ  

వేద న్యూస్, వరంగల్:

హసన్ పర్తి మండల పరిధిలోని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ గా రామ్శెట్టి మౌనిక, ఏడిఈ గంగారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం మౌనిక మాట్లాడుతూ హసన్ పర్తి మండలంలో విధుల్లో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఉన్నతాధికారుల సూచనలతో మండల అధికారుల సమన్వయంతో, ఇతర విభాగాల సహకారంతో విద్యుత్ అంతరాయం లేకుండా తన వంతు సేవలు అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

తాను విధులు నిర్వహిస్తున్న సందర్భంగా విద్యుత్ శాఖ ఇతర అధికారులు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. అన్ని గ్రామాల్లో ఉన్న లైన్ మెన్లను, ఇతర సిబ్బంది, సమన్వయం, సహకారంతో పకడ్బందీగా సేవలందియడానికి తన సహాయ సహకారాలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మౌనిక వెల్లడించారు.

కార్యక్రమంలో విద్యుత్ ప్రధాన కార్యాలయం నుంచి Ade, ఇతర అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.