వేద న్యూస్, ఎల్కతుర్తి:

ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో బొజ్జగణపతి మహరాజ్ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హాజరై పూజల్లో పాల్గొన్నారు. సిద్ది, బుద్ధిని ప్రసాదించే విఘ్నేశ్వర చతుర్థి వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.