వేద న్యూస్, వరంగల్ :
నాబార్డు ద్వారా అందించే జీవనోపాధుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య పేర్కొన్నారు. గురువారం వరంగల్ జిల్లా రంగసాయిపేట ప్రాంతంలో నాబార్డ్ సౌజన్యంతో చేపట్టే జీవనోపాధుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల పై నాబార్డ్, ఇత్తడి నగిసి కళాకారుల సహాయ నూతన ప్రాజెక్ట్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ప్రాచీన ఇత్తడి నగిసి కళాకారులను ప్రోత్సహించడంలో నాబార్డు సంస్థ అందిస్తున్న సహాయ సహకారాలు కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించడం శుభ పరిణామమని
చెప్పారు. వరంగల్ జిల్లా లో మొదలైన ప్రాచీన ఇత్తడి నగి షీ కల ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు.
రూ.23 లక్షల 38 వేల వ్యయంతో రంగసాయిపేట ప్రాచీన ఇత్తడి నగిసి కళాకారులకు ప్రోత్సహిస్తూ సహాయం అందించే ప్రాజెక్టు రూపకల్పన చేయడం అభినందనియమని తెలిపారు. నాబార్డ్ సంస్థ ద్వారా రంగసాయిపేట 60 మంది ఇత్తడి నగిసి కళాకారుల క్లస్టర్ ప్రోత్సాహం అందిస్తూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉపయోగించు కోవాలని అన్నారు.
కళాకారులకు టూల్స్ డిస్ట్రిబ్యూషన్, మిషనరీ ఐటమ్స్ లతో ప్రోడక్ట్ ను తయారు చేయడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మార్కెట్లో తయారు చేసే వస్తువులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మెళకువలు పెంపొందించుకోవాలని, క్లస్టర్ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం ప్రాచీన ఇత్తడి నగిసి కళాకారుల తయారుచేసిన గృహోపకరణ, దేవాలయాల చిత్రాలను కలెక్టర్ పరిశీలించి, కళాకారులను అభినందించారు.
అంతకు ముందు ప్రాచీన ఇత్తడి నగిసి కళాకారుల సహాయం అందించే ప్రాజెక్ట్ రూపకల్పన నివేదికలనునాబార్డ్ సాయంతో జిల్లా కలెక్టర్ ద్వారా అందించారు. ఈ సమావేశంలో జిల్లా నాబార్డ్ సీజీఎం సుశీల చింతల,నాబార్డ్ ఏజీఎం లు రవి, చంద్రశేఖర్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నరసింహమూర్తి, మారి సంస్థ వైస్ చైర్మన్ హేమనలిని, అధ్యక్షులు మారపాక వెంకట్ ,రంగసాయిపేట ఇత్తడి నగిసి కళాకారుల సొసైటీ ప్రెసిడెంట్ ప్రణయ్ కుమార్ , హ్యాండీ క్రాఫ్ట్ అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.