వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి :

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న గుడిని దేవాలయ శాఖలో విలీనం చేయడం దేవాలయ అభివృద్ధికి అడ్డంకి అని నియోజకవర్గ బిజెపి నాయకులు పీసు రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రామ సభ్యుల అనుమతి లేకుండా ఈ విధంగా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం వచ్చే దేవాలయాలను వెతికి మరి దేవాదాయ శాఖలో విలీనం చేయడం జరుగుతుందని తెలియజేశారు. మొన్నటికి మొన్న వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం ఈ రోజు పెద్దాపూర్ మల్లన్న స్వామి దేవాలయాన్ని విలీనం చేయడం ద్వారా ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకుందని తెలియజేశారు. వెంటనే దీనిపై దేవాదాయ అధికారులు స్పందించి విలీనాన్ని ఆపాలని లేదంటే పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.