వేద న్యూస్, హనుమకొండ:
“నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ” అనే అంశంపై కాజీపేట ఫాతిమా నగర్ లోని బాలవికాసలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు విభజిత జిల్లాల వ్యాసరచన పోటీల విజేత విద్యార్థులకు ప్రశంస పత్రాలు, సామాజిక సేవకులకు వింగ్స్ ఆఫ్ ఫైర్ 2025 అవార్డుల ప్రదానం చేయనున్నట్టు డాక్టర్ అశోక్ పరికిపండ్ల తెలిపారు.
భారతరత్న, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పదో వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 27న (ఆదివారం) కాజీపేట, ఫాతిమా నగర్ లోని బాలవికాస కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం2 గంటల వరకు “నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ” “CREATING LIVABLE PLANET” అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని లీడ్ గ్లోబల్ ఫౌండేషన్ సమన్వయకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన జాతీయ స్థాయి మేధావులు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడమే కాకుండా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విభజిత జిల్లాలైన వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఇదే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఈ కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ రంగాలలో సామాజిక సేవలు అందించిన ప్రముఖులకు, సామాజిక సేవకులకు “వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎక్సలెన్సీ 2025” అవార్డుల ప్రదానం కార్యక్రమం ఉంటుందన్నారు.
ఈ ప్రోగ్రామ్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రముఖుల చేతుల మీదుగా అందజేయబడతాయని కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. జిల్లాల్లో నీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ,ఎయిడెడ్, అన్ని పాఠశాలల యాజమాన్యాలు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని విద్యార్థులను ఈ సదస్సులో పాల్గొనేలా ప్రోత్సహించాలని, జిల్లాలోని పర్యావరణ ప్రేమికులు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అభిమానులు, సామాజికవేత్తలు ఈ సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును దిగ్విజయం చేయాలని , వివరాలకు ఫోన్ నంబర్లు 9989310141,93901111929 లలో సంప్రదించాలని డాక్టర్ అశోక్, డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.