• స్వామి వివేకానంద జయంతి రోజున ప్రారంభం
  • ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా “జాతీయ యువజన దినోత్సవాన్ని” పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో ప్రజాసేవయే లక్ష్యంగా నియోజవర్గ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ ‘‘యువసేన ఫౌండేషన్’’ ను శుక్రవారం స్థాపించారు. ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి స్వీట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శివకోటి మాట్లాడుతూ నేటి యువతకు స్వామి వివేకానంద జీవితం ఆదర్శమని చెప్పారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ నలుదిశల చాటి చెప్పి..ఎంతోమంది మహనీయులకు స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మికవేత్త, మహనీయుడు స్వామి వివేకానందుడు అని వెల్లడించారు.

నేడు యువత చిన్న చిన్న సమస్యలకు, వైఫల్యాలకు మనస్థాపం చెంది ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడడం, డ్రగ్స్ కి బానిసలుగా మారడం బాధాకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుడి సందేశాలను చదివి ఆచరిస్తే..ప్రతీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

వివేకానందుని ఆలోచనల స్ఫూర్తితో యువసేన ఫౌండేషన్ ముందుకు నడుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు, కోశాధికారి వంగ మధు, ప్రధాన కార్యదర్శి ఓర్సు రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బ పృధ్విరాజ్, ఎలబోయిన డేవిడ్, గాండ్ల అరుణ్, మాదారపు కృష్ణ, సెక్రటరీలు పోశాల కార్తీక్, కొమ్ము రంజిత్, ఫౌండేషన్ సభ్యులు ఆలకుంట నాగులు, సంపంగి సాయికుమార్, జమీర్ అఖిల్, అజయ్, ప్రశాంత్, భాస్కర్, రాంబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.