- టీడీపీ 14 వ డివిజన్ అధ్యక్షులు పాషికంటి రమేష్ పిలుపు
వేద న్యూస్, కాశీబుగ్గ:
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు వచ్చాయని టిడిపి గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాషికంటి రమేష్ అన్నారు. గురువారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం డివిజన్ అధ్యక్షుడు పాషికంటి రమేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ లో 2001లో స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అత్యంత ప్రాధాన్యత గలదని నాటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు.
ఎస్సీ ఎస్టీ బీసీ, మహిళ మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన ఎన్టీఆర్ వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి 14వ డివిజన్ బీసీ సెల్ కార్యదర్శి ముండ్రాతి శరత్ బాబు, సీనియర్ నాయకులు లాసాని నర్సింగరావు, ఎన్టీఆర్ అభిమాన సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్, ఎన్టీఆర్ నగర్ గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.