•  పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వేద న్యూస్, రాయపర్తి :
ఇతరులకు తమ వంతు సహకారం అందించడంలో ఎనలేని సంతృప్తి మిగులుతుందని, పదిమందికి సాయం చేసే గుణం గొప్పదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ వారు మండలంలోని తిర్మలాయపల్లి కస్తూర్బా పాఠశాలకు, సోలార్ పెన్సింగ్, హీట్ వాటర్ మిషన్, వాటర్ ప్లాంట్ మరమ్మత్తు, లాప్ టాప్ లు, క్రీడా పరికరాలు అందించారు.

ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. సేవా భావాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివే తత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలన్నారు. చదువుకునే వయస్సులో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు.

తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ వారు విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషకరం అన్నారు. పాఠశాల అభివృద్ధికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మనకోసం కష్టపడే నాన్నను, ప్రతి బాధలోనూ తోడైన అమ్మను, విద్యాబుద్ధులు నేర్పించిన గురువును ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. గెలుపు, ఓటములు సహజమేనని ఓడిపోయినంత మాత్రాన అధైర్యపడుతూ ఉండకూడదని మరింత కసితో ప్రయత్నించి గెలుపు దిశగా ప్రయాణించాలన్నారు. 

కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోతు అమ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ గుమ్మడి వీరభద్రం, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, యూఎస్ఏ ఫాస్ట్ ప్రెసిడెంట్ మురళి చింతలపాని, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బి కవిత, ఉపాధ్యాయులు ప్రమీల, స్వరూప, విజయ,శ్రీ శైలజ సంధ్యారాణి, జోత్స్న, స్రవంతి, ఎస్ శైలజ,శ్రావణి, స్నేహలత, స్వప్న, రజని,జ్యోతి,పద్మ కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.