వేద న్యూస్, ఎలిగేడు :
పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాలలో ఆదివారం కేక్ లు కట్ చేస్తూ ..మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు.
ఎలిగేడు మండలంలో ఉదయం దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎలిగేడు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని, అన్ని పల్లెలు చాలా అభివృద్ధి చెందాయని చెప్పారు.
ముఖ్యంగా గత సంవత్సరం కురిసిన వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న రైతులను.. దాసరి ముందుండి ఆదుకున్నారని కొనియాడారు. నాయకుడు గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ లాలపల్లి గ్రామంలో ఎప్పుడు జరిగిన విధంగా గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మోహన్ రావు, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశం, మల్లేశం, సాయి, జగన్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.