వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి అధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం ప్రచారం చేపట్టారు. 13 వ వార్డులో గడప గడపకు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి రెడ్యానాయక్ ను డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. డోర్నకల్ ప్రజా క్షేమమే ధ్యేయంగా పని చేసే వ్యక్తి రెడ్యా అని జనానికి వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నూకల నరేష్ రెడ్డి, మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర రవి నాయక్, మాజీ ఓడీసీఎంఎస్ కుడితి మహేందర్ రెడ్డి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ రాంలాల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
