వేద న్యూస్, పాపన్నపేట :

యూరియా కోసం రైతులు సోమవారం బస్టాండ్ ఎదుట ఉన్న మెదక్ – బొడ్మట్ పల్లి రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌లో బుక్‌ చేసుకుందామని ఓపెన్‌ చేసే లోపే సెకండ్లలోపే యూరియా ఖాళీ అవుతోందన్నారు.

దీంతో తమకు యూరియా దొరకడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం పాత పద్ధతిలోనే యూరియాను నేరుగా రైతులకు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు చేపట్టిన ధర్నాతో రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు రైతుల వాగ్వాదం చోటుచేసుకుంది తహసీల్దార్ సతీష్ కుమార్,ఏవో శ్రీనివాస రాజు వచ్చి రైతులకు నచ్చచెప్పారు. యూరియా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.