•  ల్యాదెళ్ల గ్రేడ్-1 గ్రామ పంచాయతీ సెక్రెటరీ పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో వక్తలు

వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ల్యాదెళ్ల గ్రామ పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్-1) బట్టు అన్నపూర్ణ పదవీ విరమణ సభ సోమవారం ఘనంగా జరిగింది. దామెర మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఉద్యోగరీత్యా వృత్తి జీవితంలో పదవీ విరమణ సహజమేనని అభిప్రాయపడ్డారు. సేవాభావంతో 30 ఏండ్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అన్నపూర్ణ అమూల్యమైన సేవలందించారని చెప్పారు. ఉన్నత విద్యావంతురాలైన అన్నపూర్ణ పని పట్ల అంకిత భావం కలిగి ఉన్నవారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ-ఉపేందర్ బాబు దంపతులను అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు సత్కరించారు.  

కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి షరిఫుద్దీన్, ఎంపీఓ రంగాచారి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, పరకాల డివిజన్ అధ్యక్షులు మనోహర్,మండల అధ్యక్షులు శ్రీనివాస్,కార్యదర్శులు సరళ, వేణు మాధవ్,రామ్మూర్తి,కవిత, మణిదీప్,రజిత,సిరి వెన్నెల,సుకన్య, ధర్మారెడ్డి , పద్మ, అమిత,మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు, ఎంజీనరేగా ఏపి ఓ శారద మరియు సిబ్బంది, ల్యాదేళ్ళ గ్రామ సిబ్బంది ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.