•   ఆరె సంక్షేమ సంఘం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, ఎల్కతుర్తి:
బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో శనివారం ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ, ఆరె కుల సర్పంచుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి కండేరావు అధ్యక్షతన జరిగింది. ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎంతో శ్రమకోర్చి హనుమకొండ జిల్లా కమిటీ 2026 క్యాలెండర్‌ను రూపొందించడం అభినందనీయమని అన్నారు.

క్యాలెండర్ అనేది ఆరె కుల ఐక్యతకు దండలో దారం లాంటిదని వ్యాఖ్యానించారు. 14 మంది ఆరె కుల సర్పంచులు ఎన్నికవడం గర్వకారణమని, ఈ విజయం గ్రామ స్థాయితో ఆగకుండా చట్టసభల వరకు కొనసాగాలని ఆకాంక్షించారు.

సాధారణ ప్రజల గుండెల్లో ధైర్యం నింపిన మహానేత, గ్రామ పాలనకు ప్రాధాన్యం ఇచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజు స్పూర్తితో ఆరె కుల సర్పంచులు గ్రామాల్లో ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి శివాజీ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా కమిటీ సంఘ కార్యక్రమాల్లో అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.

ఆరె కుల సర్పంచులకు భవానీ మాత ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు.
ఆరె కులం విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక అభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు సాగాలంటే శివాజీ మహారాజ్ చూపిన ధైర్యం, క్రమశిక్షణ, ఐక్యతను అనుసరించాలని వక్తలు సూచించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులు ముందుండాలని, గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఏర్పాటు చేయాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జెండా రాజేష్, మోర్తాల చందర్ రావు,బలేరావు మనోహర్ రావు, కుడ్ల మనోహర రావు, లాండిగే లక్ష్మణరావు, వలిగే సాంబరావు, హింగే శివాజీ, దుమాల సుధాకర్, సుకినె సంతాజీ, జిల్లా గౌరవ అధ్యక్షులు వాడికారి బాబురావు,ప్రధాన కార్యదర్శి వజ్ర కిషన్ రావు జిల్లా నాయకులు పేర్వాల లింగమూర్తి, లోనె దీపక్ జి, నాగుర్ల సంతోష్, కిషన్ రావు, సుధాకర్ రావు హింగే భాస్కర్,శ్రీనివాస్ వివిధ మండలాల అధ్యక్షులు, కులబంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.