వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల కేంద్రం లోని నూతన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, గ్రామ సఫాయి కార్మికులను ఎల్కతుర్తి మండలం సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు బుధవారం ఘనంగా సన్మానం చేశారు.
సన్మాన కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ మొదటగా పారిశు ధ్య (సఫాయి) కార్మికుల ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతో కఠోరమైన పని అయిన పారిశుద్ధ్య పనిని ప్రేమతో అంతా నాదే ..అని తన ఇంటి లాగా భావించుకొని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటారో అదే రీతిలో గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా కృషి చేస్తున్న.. సఫాయి కార్మికులకు ఎంత చేసిన వారి శ్రమకు తక్కువేనని అంటూ ..వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం గ్రామ పాలకవర్గ సభ్యుల ను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామం అభివృద్ధికి ప్రతి కార్యక్రమంలో ముందుండి.. సర్పంచికి గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న పాలకవర్గానికి ధన్యవాదాలు తెలిపారు .త్వరలో రాబోయే పాలకవర్గం కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మాజీ సర్పంచ్ లు గొడిశాల యాదగిరి గౌడ్, గొల్లె మహేందర్(మల్లన్న), గ్రామ ఎంపిటిసి కడారి రాజు ,గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి నాయక్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, బి ఆర్ ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు అల్లకొండ రాజు , వీణవంక రమేష్ గూడెల్లి నవీన్ కుమార్ రాజయ్య గౌడ్ గ్రామ పాలకవర్గ సభ్యులు అంబాల రాజు, గొడిశాల వినయ్ అల్ల కొండ సంధ్య , కరోబార్ లక్ష్మణ్, ఫీల్డ్ అసిస్టెంట్ అంబాల క్రాంతికుమార్, అంబాల శ్రీనివాస్ , ఆశా వర్రకర్లు మ అంగన్వాడి టీచర్ శోభ ఉమా తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.