Oplus_131072

= పోలీస్ శాఖకే ఈ గతి!

ప్రమాదకర స్థితిలో కొన్ని ఖాకీల వెహికల్స్ 

= గత కొద్ది కాలంగా ఫిట్‌నెస్‌కు దూరం..!

= మరమ్మతులు పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధికారులు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

సామాన్య ప్రజలకు సమస్య వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు, తోబుట్టినోళ్ల కంటే ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులు. టక్కున ఫోన్ తీసి డయల్ 100 చేసి తమ సమస్యను చెప్పుకుంటుంటారు. ఆ సమయంలో స్పందించే పోలీసులు తక్షణమే పోలీస్ వాహనాలను వేసుకొని ‘కుయ్..కుయ్.. కుయ్’ అంటూ జెట్ స్పీడ్ లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. అయితే ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీసు వాహనాలు సరైన ఫిట్ నెస్ లేక ప్రమాదకరంగా మారాయని తెలుస్తోంది. మరికొన్ని వెహికల్స్ కు సరైన వీల్ అలైన్మెంట్ లేక సైడ్ మిర్రర్లు లేక..ఇంకొద్ది వాహనాలకు సరిగ్గా బ్రేకులు పడని పరిస్థితులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా సరైన ఫిట్‌నెస్ లేని  వాహనాలను వేసుకొని పోలీసులు రోడ్లపై అత్యవసర సమయంలో విధులు నిర్వహించాలి అంటే ఇబ్బందికరంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ వాహనాల పట్ల ప్రభుత్వం, పోలీస్ ఉన్నత అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీసులకు వాహనాలు అత్యంత కీలకమన్న సంగతి గుర్తించాలని అంటున్నారు.