• విద్యార్థుల రాజకీయ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సందీప్

వేద న్యూస్, హుస్నాబాద్:
వ్యవస్థలో మార్పు కోసం ప్రజలు ఒకసారి వీఆర్‌పీ వైపు చూడాలని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్‌పీ) హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కొంగంటి సందీప్ జనాన్ని అభ్యర్థించారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిచేందుకు నిరుద్యోగులంతా కలిసి ‘విద్యార్థుల రాజకీయ పార్టీ’ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యెచ్చు సునీల్ తెలిపారు.

ఆ పార్టీ తరఫున హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంగంటి సందీప్ బరిలోకి దిగుతున్నారు. సందీప్‌కు విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు బీ ఫామ్ అందజేశారు. విద్యార్థుల రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు ‘బ్యాట్ ’కు ఓటేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా కొంగంటి సందీప్ సోమవారం ప్రజలను కోరారు.