వేద న్యూస్, తాడ్లపేట:

విశ్వసనీయ సమాచారం ఆధారంగా తాడ్లపేట అటవీ రేంజ్ అధికారిణి సుష్మ రావునాయకత్వంలో తాడ్లపేట రేంజ్ సిబ్బంది కొత్తమామిడిపల్లి గ్రామానికి వెళ్లి, ఆ గ్రామానికి చెందిన లడ్డు అలియాస్ గనిశెట్టి కార్తీక్ ఇంటిపై రైడ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఎఫ్‌బిఓ (డాగ్ స్క్వాడ్) అనిల్ , హంటర్ డాగ్ కూడా బృందంతో కలిసి పాల్గొన్నారు.

మొత్తం 8 అటవీ టేకు దుంగలు, మొత్తం పరిమాణం 0.389 క్యూబిక్ మీటర్లు, టేకు దుంగల అంచనా విలువ రూ.33,606 విలువ గల టేకు దుంగలను స్వాధీనం చేయబడ్డాయి.

ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.