వేద న్యూస్, హైదరాబాద్:

“ఆరె తెలంగాణ” జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ-2024 క్యాలెండర్ ను ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ పెర్వారం రాములు హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆరె కులస్తుల సంఘటితం కోసం క్యాలెండర్ రూపొందించిన ఆరె తెలంగాణ జర్నలిస్టుల వెల్ఫేర్ సొసైటీ అధినేత కోలె దామోదర్ రావు ను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరె సామాజిక వర్గ ప్రజల చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.