వేద న్యూస్, సుల్తానాబాద్ :
లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి సౌజన్యంతో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్ ఏర్పాటు చేశారు.

సోమవారం సుమారు 150 మందికి కంటి జబ్బులు, దృష్టి లోపాలు ఉన్న వారిని పరీక్షించారు. వారిలో 18 మందికి కంటి శుక్లాలు, కంటి ఆపరేషన్ అవసరాన్ని గుర్తించారు. వారితో పాటు ఒక సహాయకునికి రాను పోను ఉచిత బస్సు ఖర్చులు, భోజన సదుపాయాన్ని కల్పించి రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ కు పంపించారు.

కార్యక్రమంలో కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నోముల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి వలస నీలయ్య జిల్లా కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్ పిట్టల వెంకటేశం ప్రభాకర్ కళాశాల ప్రిన్సిపాల్ బండారి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.