వేద న్యూస్, వరంగల్ టౌన్:
కార్పొరేట్ స్థాయిలో నిరుపేదలకు మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటుచేసి వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేస్తామని రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామ సందీప్ అన్నారు.
సోమవారం వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ జక్కలోద్ది అధ్యక్షులు రామ సందీప్ ,ఉపాధ్యక్షులు సెక్రటరీ గజ్జ చందు ఆధ్వర్యంలో జక్కలోద్ది గ్రామంలోని నిరుపేదలకు మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం వైఆర్ కేర్ స్వచ్చంద సంస్థ సుమారు 150 మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ సందీప్ గజ్జ చందు మాట్లాడుతూ రామ సురేందర్ నగరంలోని నిరుపేదల కోసం మరిన్ని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులతో మాట్లాడి ఉచిత మెగా క్యాంపులను ఏర్పాటు చేసి పేద వారికి వైద్య పరీక్షలతో పాటు మందులను పంపిణీ చేస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యుల బృందం తో పాటు సిబ్బంది రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు నాయకులు పాల్గొన్నారు.