వేద న్యూస్, హైదరాబాద్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న ప్రారంభమైన సేవా పక్షం కార్యక్రమాలలో భాగంగా, సేవ పఖ్వాడ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సికింద్రాబాద్‌లోని హోమ్ ఫర్ ది డిసబుల్డ్ అనాధాశ్రమంలో మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును సేవా పక్షంగా నిర్వహించడం సమాజానికి ఎంతో మేలుచేసే నిర్ణయమన్నారు. దేశవ్యాప్తంగా దివ్యాంగులు, అనాథలు మరియు అణగారిన వర్గాల కోసం ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకం అన్నారు. సాయం చేయాలనే ప్రధాని మోదీ సంకల్పం సమాజంలో సానుకూల మార్పుకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.